న్యూఢిల్లీ : 2008 ముంబయి ఉగ్రదాడులకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న తహవ్వూర్ రాణా వాయిస్, హ్యాండ్ రైటింగ్ నమూనాలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) శనివారం సేకరించింది. ఢిల్లీ కోర్టులో ఇన్-ఛాంబర్ విచారణలో ఎన్‌ఐఎ అధికారులు వీటిని సేకరించారు. శనివారం భారీ భద్రత మధ్య జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టుకు రాణాను ఎన్‌ఐఎ అధికారులు తీసుకొచ్చారు. జడ్జి వైభవ్ కుమార్ ముందు రాణా వివిధ పదాలు, అంకెలు రాసాడు. కోర్టు రాణాకు గతవారంలో 12 రోజుల కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. ముంబయి దాడుల ఘటన జరిగిన 17 ఏళ్ల తరువాత రాణాను అమెరికా భారత్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 10న అమెరికా ప్రత్యేక సైనిక విమానంలో భారత్‌కు వచ్చిన రాణా వెంటనే ఎన్‌ఐఎ అదుపులోకి తీసుకుంది. విచారణ నిర్వహిస్తుంది.