Wednesday, July 9, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకలెక్టరేట్ లో పెట్రోల్ పోసుకున్న రైతు భూమిని పరిశీలించిన తహశీల్దార్..

కలెక్టరేట్ లో పెట్రోల్ పోసుకున్న రైతు భూమిని పరిశీలించిన తహశీల్దార్..

- Advertisement -

నవతెలంగాణ – బొమ్మలరామారం : తన పేరున ఉన్న రెండు ఎకరాల మూడు గుంటల భూమి ఇతరుల వెళ్లిందని ఆవేదనతో సోమవారం కలెక్టరేట్లో బాదిత రైతు పెట్రోల్ పోసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు తహశీల్దార్ శ్రీనివాసరావు నాగిని పల్లి గ్రామంలో గల భూమిని మంగళవారం ఆర్ఐ వెంకట్ రెడ్డి, సర్వేయర్ శ్రీనివాస లతో కలిసి పరిశీలించారు. బాధిత రైతు తన భూమి హద్దులను సరిగా గుర్తించడం లేదని, ఈ మేరకు తన భూమిని సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని రెవెన్యూ అధికారులను కోరినట్లు తెలిసింది. బాధిత రైతు విన్నపం మేరకు సర్వే నెంబర్లలో గల రైతులకు నోటీసులు జారీ చేసి భూమిని సర్వే చేయనున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -