- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
జిల్లాలో నిర్వహించనున్న మినీ మేడారం జాతరలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలనే జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాల మేరకు మండల తహశీల్దార్ రవికుమార్ శుక్రవారం మండలంలోని దుబ్బపేట సమ్మక్క-సారలమ్మ జాతర గద్దెలను సందర్షించి,పరిశీలించారు. మినీ జాతర నిర్వహకులతో ఆయన మాట్లాడారు. ఈనెల 28 నుంచి 31 వరకు జాతరలో బిటి రోడ్డు నుంచి గద్దెల వరకు తాత్కాలిక అప్రోచ్ రోడ్డు, సింగిల్ పేజ్ విద్యుత్ లైన్, తాగునీరు, తాత్కాలిక మరుగు దొడ్లు ఏర్పాటు చేయాలని తహసీల్దార్ నిర్వాహకులు విన్నవించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకపోయి త్వరలోనే పనులు జరిగేలా చూస్తునని తహశీల్దార్ తెలిపారు.
- Advertisement -



