సీఐటీయూ మండల కన్వీనర్ పెరుమాండ్ల బాబు గౌడ్
నవతెలంగాణ – నెల్లికుదురు
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు, లేబర్ కోడు నాలుగు రద్దు చేయాలని డిమాండ్ చేసినట్లు సీఐటీయూ మండల కన్వీనర్ పెరుమాండ్ల బాబు గౌడ్ తెలిపారు. శనివారం తహసిల్దార్ కార్యాలయంలోని తహసిల్దార్ చందా నరేష్ వినతిపత్రాన్ని అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ లను తక్షణమే రద్దు పరిచి కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉన్నంత వర్గాలకే ముగ్గు చూపుతుందని పేద బడుగు బలహీన వర్గాల కార్మికులను పట్టించుకోవడంలో పూర్తిగా విఫలం చెందిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.
నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని తాహశీల్దార్ కు వినతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



