Magazines

లెక్కింపు వీడియోలు భద్రపరచలేరా? ఈసీపై సుప్రీంకోర్టు ఆగ్రహం

1 గంట క్రితం

Can't the counting videos be preserved? Supreme Court angry with EC

Supreme Court

వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ఎన్నికల సమయంలో ఓట్ల లెక్కింపు వీడియోలను కూడా భద్రపరచలేకపోతే ఎలా? అంటూ సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. కర్ణాటకలోని శృంగేరి అసెంబ్లీ నియోజకవర్గం 2023 ఎన్నికల అసలు లెక్కింపు వీడియోలు అందుబాటులో లేవన్న సమాధానంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి సాకులను అంగీకరించబోమని స్పష్టం చేస్తూ, అందుబాటులో ఉన్న రికార్డులన్నీ సమర్పించాలని ఆదేశించింది. లేనిపక్షంలో ప్రతికూల నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

2023 ఎన్నికల్లో శృంగేరి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి టీడీ రాజేగౌడ తొలుత విజయం సాధించారు. దీనిని సవాలు చేస్తూ బీజేపీ అభ్యర్థి జీవరాజ్‌ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తిరస్కరించిన 279 పోస్టల్‌ బ్యాలెట్లను మళ్లీ పరిశీలించాలని హైకోర్టు ఆదేశించడంతో రీకౌంటింగ్‌ అనంతరం జీవరాజ్‌ విజయం సాధించినట్లు ప్రకటించారు. దీంతో రాజేగౌడ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

తాజా విచారణలో అసలు లెక్కింపు వీడియోలు కనిపించడం లేదని ఈసీ తరఫు న్యాయవాది తెలపగా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌, జస్టిస్‌ సంజీవ్‌ సచ్‌దేవాలతో కూడిన ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికల పరిశీలకుడి నివేదికతో పాటు లెక్కింపు, రీకౌంటింగ్‌ వీడియోలను సమర్పించాలని రాజేగౌడ కోరుతున్నారు. ఈ కేసు తదుపరి విచారణను 2027 ఫిబ్రవరి 15కు వాయిదా వేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్