నవతెలంగాణ - హైదరాబాద్ : అంతరించిపోతున్న స్వదేశీ వరి వంగడాలను సంరక్షిస్తూ, ప్రకృతి వ్యవసాయానికి విశేష కృషి చేసిన పద్మశ్రీ పురస్కార గ్రహీత చెరువయల్ రామన్ (74) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కేరళలోని వయనాడ్ జిల్లా మానంతవాడికి చెందిన రామన్ కురిచ్య గిరిజన తెగకు చెందినవారు. ప్రాథమిక విద్య అనంతరం పదేళ్ల వయసులోనే వ్యవసాయం ప్రారంభించారు. 1969లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా దానిని వదులుకుని పూర్తిస్థాయిలో సాగుకే అంకితమయ్యారు.
పద్మశ్రీ చెరువయల్ రామన్ కన్నుమూత
1 గంట క్రితం

Padma Shri Cheruvayal Raman
వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 15, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)