Magazines

ఫ్లైఓవర్‌పై కారులో మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం

1 గంట క్రితం

Car catches fire on flyover.. narrowly missed accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : హైదరాబాద్‌ శివారులోని మేడ్చల్‌ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. అన్నూజిగూడ ఫ్లైఓవర్‌పై వెళ్తున్న ఓ రెనాల్ట్‌ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న వరంగల్‌కు చెందిన నలుగురు అప్రమత్తమై వెంటనే కిందకు దిగడంతో సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని భావిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్