నవతెలంగాణ - హైదరాబాద్ : మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ సీఐ బాలస్వామిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. భూ వివాదానికి సంబంధించిన కేసును తప్పుదోవ పట్టించడంతో పాటు, సెప్టెంబర్లో ఓ యువతి ఆత్మహత్య కేసులో అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అక్టోబర్ 14న మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. అయితే సస్పెన్షన్పై అధికారిక ధ్రువీకరణ రావాల్సి ఉంది.






కామెంట్లు (0)