Magazines

జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి: AISA

6 గంటల క్రితం

aisa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని దేశరాజధాని ఢిల్లీలో రోజురోజుకు నిరసనలు ఉధృతమువుతున్నాయి. తాజాగా జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ.. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్' (AISA), ఇతర సంస్థల సభ్యులు దేశ రాజధానిలోని అశోక్ రోడ్ సమీపంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆంధ్ర భవన్ నుంచి జంతర్ మంతర్ వైపుగా నిరసనకారులు ర్యాలీ నిర్వహించారు. ఈక్రమంలో AISA జాతీయ అధ్యక్షురాలు నేహా బోరాను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


ఆ ప్రాంతంలో భారీ పోలీసు బారికేడ్లు, భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ నిరసనకారులు జంతర్ మంతర్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. అశోకా రోడ్డులోని ఆంధ్ర భవన్ సర్కిల్ సమీపంలో ఈ ఆందోళన ప్రారంభమైంది. AISA సభ్యులు, మద్దతుదారులు ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జంతర్ మంతర్ వైపుగా కవాతు చేశారు. నిరసనకారులు నిర్దేశిత నిరసన స్థలం వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకుని, వారిలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

Members of the All India Students' Association (AISA) near Ashok Road  (Photo/ANI)



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్