Magazines

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

55 నిమిషాల క్రితం

road accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: గుజరాత్‌లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భావ్‌నగర్ జిల్లాలో వేగంగా వస్తున్న ఓ కారు ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ఈ ఏడుగురూ అలంగ్‌లో ఓ షిప్‌యార్డులో పనిచేస్తున్నారు. ఈరోజు ఉదయం గుజరాత్‌లోని భావ్‌నగర్ నుంచి అలంగ్‌కు కారులో బయలుదేరారు. ఈ క్రమంలో సోమ్‌నాథ్ హైవే సమీపంలో ఉన్న ఓ సర్వీసు రోడ్డుపై ఆగి ఉన్న ట్రక్కును వీరి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా, మరో వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందారు.


ప్రమాదానికి గురైన వాహనం పూర్తిగా ధ్వంసమైంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్