నవతెలంగాణ - హైదరాబాద్ : 2027లో జరగనున్న ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. టోర్నీకి ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికీ టికెట్ల కోసం అనూహ్య స్పందన లభిస్తోంది. టికెట్ బ్యాలెట్ ప్రక్రియ ప్రారంభమైన 12 రోజుల్లోనే 1.5 కోట్లకు పైగా దరఖాస్తులు వచ్చాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
ఐసీసీ వెల్లడించిన వివరాల ప్రకారం.. 142 దేశాల నుంచి అభిమానులు టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకు 1,50,83,752 టికెట్ దరఖాస్తులు రాగా, 44,23,417 బ్యాలెట్ రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన తొలి వారంలోనే 10 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత ఈ సంఖ్య భారీగా పెరిగింది. దాదాపు 24 ఏళ్ల విరామం తర్వాత ఆఫ్రికా గడ్డపై ప్రపంచకప్ జరగనుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.







కామెంట్‌లు (0)