Magazines

అందరూ కనెక్ట్‌ అవుతారు

55 నిమిషాల క్రితం

Everyone will connect.
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 2 నిమిషాల చదవడం

నరేష్ విజయ కృష్ణ, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘క్రేజీ కల్యాణం’. ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2గా బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మించారు. బద్రప్ప గాజుల దర్శకుడు. దసరా పండుగ సందర్భంగా ఈ నెల 16న ఈ సినిమా రిలీజ్ కు వస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం హీరో అఖిల్ రాజ్ మీడియాతో సినీ విశేషాలను షేర్‌ చేసుకున్నారు. ప్రొడ్యూసర్ జగన్ మోహన్ రెడ్డి నిర్మాణంలో ‘విందు భోజనం’ అనే సినిమా చేశాను. అప్పటి నుంచి ఆ సంస్థతో, వారితో టచ్ లో ఉంటూ వచ్చాను. ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగు తున్నప్పుడు పిచ్ డెక్ లో ఈ సినిమాలోని ఉదయ్ పాత్రకు నన్ను అనుకున్నారు. ఆ తర్వాత నరేష్ , అనుపమ, తరుణ్ భాస్కర్..ఇలా వీళ్లంతా కాస్టింగ్ కన్ఫర్మ్ అయ్యారు. అప్పుడు ఫుల్ స్క్రిప్ట్ నాకు పంపారు. స్క్రిప్ట్ చదువుతూ ఫుల్ ఎంజాయ్ చేశాను. నా క్యారెక్టర్ కు ఫన్ అండ్ లవ్ సీన్స్ ఉంటాయి. నరేష్, తరుణ్ భాస్కర్ క్యారెక్టర్స్ కు ధీటుగా నా క్యారెక్టర్ ను పర్ ఫార్మెన్స్ తో నిలబెట్టాలని అనుకున్నాను.


నన్ను ఏం ఆశించి బద్రప్ప అన్న తీసుకున్నాడో గానీ వందశాతం ఉదయ్ గా కనిపించేందుకు ప్రయత్నించాను. ‘రౌడీ బాయ్స్’ సినిమాలో అనుపమ హీరోయిన్ గా నటించింది. నేను చిన్న రోల్ చేశాను. ఆ సినిమా చూస్తున్నప్పుడు నువ్వు హీరో అయ్యాక ఈ అమ్మాయితో కలిసి నటించు అని మా అమ్మ చెప్పింది. అమ్మ కోరుకున్నట్లే నేను ఈ సినిమాలో ఆమెతో కలిసి నటించాను. ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం రావడం కూడా సంతోషంగా ఉంది. డిగ్రీ పూర్తి చేసుకున్న ఉదయ్ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలనే లక్ష్యాన్ని పెట్టుకుంటాడు. ఉదయ్ పాత్రను ప్రతి ఒక్కరూ రిలేట్ చేసుకుంటారు. ఉదయ్ అనే పాత్రలో ఒక ఎనర్జీ ఉంది. అది చాలా బాగుంటుందని నేను నమ్మాను. మన ఊరిలో జరిగే కథ, మన ఇంటిలో జరిగే కథ. అంతగా మన జీవితాలకు దగ్గరగా ఉంటుంది. ఈ సినిమాలో నేను అనుపమకి ఎంత సపోర్ట్‌ చేస్తానో మీరే చూస్తారు. అలా ఎందుకు చేశాను అనేది నేను చెప్పేదాని కన్నా సిల్వర్‌స్క్రీన్‌పై చూస్తేనే మజాగా ఉంటుంది. ఇక అనుపమ, నరేష్‌, తరుణ్‌భాస్కర్‌ పాత్రలు మిమ్మల్ని కచ్చితంగా సర్‌ప్రైజ్‌ చేస్తాయి. ఈ కథకి అందరూ బాగా కనెక్ట్‌ అవుతారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్