నవతెలంగాణ-హైదరాబాద్: ఇండియా బ్లాక్ ఎంపీలు సాయంత్రం 5 గంటలకు పార్లమెంటులోని సెంట్రల్ హాల్‌లో సమావేశంకానున్నారు. ఈ రోజు రాత్రి 8 గంటలకు రాష్ట్రపతితో అపాయింట్‌మెంట్ ఉందని సంబంధింత వర్గాలు తెలిపాయి. జాతీయ రాజధానిలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసనలు వరుసగా మూడో రోజుకు చేరుకోవడంతో, గురువారం ఇండియా బ్లాక్ సభ్యులు రాజ్ ఘాట్‌ను సందర్శించారు. ఓటర్ల జాబితాల సవరణలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ప్రతిపక్ష నాయకులు ఆయన రాజీనామాను డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్షాల ఆరోపణలను ఎన్నికల సంఘం, బీజేపీ తిరస్కరించాయి.
పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఇండియా బ్లాక్ ఎంపీలు భేటీ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 09, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)