నవతెలంగాణ - హైదరాబాద్: ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ బహిరంగ సవాల్ విసిరారు. ఖైరతాబాద్‌లో తనపై పోటీ చేసి గెలవాలని, ఈ పోరులో తాడోపేడో తేల్చుకుందామని ఆయన వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌లో ఇండియా కూటమి చేపట్టిన 'సేవ్ డెమోక్రసీ' ర్యాలీలో దానం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉప ఎన్నికకు తాను పూర్తిగా సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ‘దానం నాగేందర్ అంటేనే ఒక బ్రాండ్’ అని ధీమా వ్యక్తం చేసిన ఆయన, ఈ ఉప ఎన్నిక తమ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు ఒక రెఫరెండంగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
ఖైరతాబాద్‌లో తనపై కేటీఆర్ పోటీ చేసి గెలవాలి: దానం నాగెందర్
53 నిమిషాల క్రితం

Shiva Kumar
ప్రచురించబడింది అక్టో 08, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)