Magazines

డాక్టర్ నాగేశ్వరరావు సేవలు చిరస్మరణీయం

1 గంట క్రితం

Dr. Nageswara Rao
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 08, 2026 | 1 నిమిషాల చదవడం

- గ్రామీణ, గిరిజన ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు

- దశదినకర్మలో పాల్గొని నివాళులర్పించిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

నవతెలంగాణ - అశ్వారావుపేట

గ్రామీణ, గిరిజన ప్రజలకు సుదీర్ఘకాలం వైద్య సేవలు అందించిన ఆర్ఎంపీ వైద్యుడు డాక్టర్ నాగేశ్వరరావు సేవలు చిరస్మరణీయమని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన డాక్టర్ నాగేశ్వరరావు దశదినకర్మ కార్యక్రమంలో గురువారం ఎమ్మెల్యే పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.


ఈ సందర్భంగా నిర్వహించిన సంతాప సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అశ్వారావుపేట ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తూ డాక్టర్ నాగేశ్వరరావు ప్రజల ఆదరాభిమానాలను పొందారని అన్నారు. ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పేదలు, గిరిజన కుటుంబాలకు తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తూ వారికి అండగా నిలిచారని గుర్తుచేశారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు సేవ చేస్తున్న సమయంలో అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు డాక్టర్ నాగేశ్వరరావు నుంచి తాను పలు సందర్భాల్లో వైద్యపరమైన సూచనలు తీసుకున్నానని ఎమ్మెల్యే తెలిపారు. ఆయన సూచనల మేరకు కొంతమంది బాధితులను మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు.


ప్రజలకు అవసరమైన సమయంలో అందుబాటులో ఉండటం, పేదలకు అందుబాటు ఖర్చుతో వైద్య సహాయం అందించడం ద్వారా డాక్టర్ నాగేశ్వరరావు తన సేవాభావాన్ని చాటుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు, ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రం, కాంగ్రెస్ నాయకులు తాడేపల్లి రవి, కాసాని పద్మశేఖర్, వేల్పుల సత్యనారాయణతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, డాక్టర్ నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు, స్థానికులు పాల్గొని నివాళులర్పించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్