నవతెలంగాణ-హైదరాబాద్: ఓటర్లను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు 'ఇండియా' (INDIA) కూటమి డూ ఆర్ డై(“do-or-die” ) పోరాటం చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. ఢిల్లీలో గురువారం ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీనామా చేయాలని ఎన్నికల భవన్ ఎదుట ఇండియా బ్లాక్ ఎంపీలు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనతో మీడియాతో మాట్లాడారు. బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ లు భారత ప్రజాస్వామ్యంలో అరాచకాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
"బీజేపీ, అమిత్ షా, మోదీ, జ్ఞనేష్ కుమార్ భారత ప్రజాస్వామ్యంలో అరాచకాన్ని సృష్టిస్తున్నారు. వారే భారత ప్రజాస్వామ్య విధ్వంసకులు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే మా లక్ష్యం, మేము అదే చేస్తున్నాము. ఓటర్లను, ఈ దేశంలోని సామాన్య ప్రజలను కాపాడుకోవడం కోసం ఇది మాకు అమీతుమీ(“do-or-die” ) లాంటి పోరాటం. సామాన్య ప్రజల ఓటు హక్కును కాపాడటమే 'ఇండియా' కూటమి "సరళమైన లక్ష్యం" అని ఆయన మీడియాతో చెప్పారు.






కామెంట్‌లు (0)