నవతెలంగాణ-మద్నూర్
కాంగ్రెస్ పార్టీ అధినేత లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. కార్యక్రమానికి మద్నూర్ , డోంగ్లి, మండలాల్లోని సర్పంచులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఆయా మండలాల యూత్ ముఖ్య నాయకులు భారీగా తరలి వెళ్లారు. 161వ జాతీయ రహదారి జుక్కల్ చౌరస్తాలో జరిగిన రాస్తారోకో ఆందోళనలో మద్నూర్, డోంగ్లి, మండలాలకు చెందిన సర్పంచులు, పార్టీ మండల నాయకులు, ఆయా మండలాల యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొని నిరసన తెలిపారు.







కామెంట్‌లు (0)