Magazines

వరుస చోరీల కేసును ఛేదించిన మద్నూర్‌ పోలీసులు

1 గంట క్రితం

solve serial theft case
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 08, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్ 

మండలంలో గత కొన్నిరోజులుగా వరుసగా జరుగుతున్న దొంగతనాల కేసును మద్నూర్‌ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 4న మేనూర్‌ గ్రామంలో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు మూడు ఇండ్లల్లోకి చొరబడి బంగారం, వెండి, నగదును అపహరించారని తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాలతో బిచ్కుండ సీఐ రవికుమార్, మద్నూర్‌ ఎస్‌ఐ మెహన్‌రెడ్డి ప్రత్యే బృందాలను ఏర్పాటు చేసుకుని నిందితుల కోసం గాలించామని చెప్పారు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని బస్మత్ ప్రాంతానికి చెందిన గుండెవార్ కరణ్, శైలేష్ బాబా, రాహుల్, ఎల్లప్పలను నిందితులుగా గుర్తించామని వెల్లడించారు. వీరికి శివ ఎల్లప్ప సహకరిస్తున్నాడనీ, శైలేష్‌ బాలు @ బాబాను ఇప్పటికే అరెస్టు చేశామని తెలిపారు. మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు.


ఇదిలా ఉండగా అక్టోబర్‌ 7న మరోసారి మద్నూర్‌లో చోరీ చేసేందుకు వస్తున్న కరణ్‌ గుండెవార్‌, శివ ఎల్లప్పలను మద్నూర్‌ శివారులోని మిర్జాపూర్‌ హనుమాన్ ఆలయం వద్ద చాకచక్యంగా వ్యవహరించి అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. నిందితులను నుంచి రూ.1100/- నగదు, ఒక మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. అనంతరం కేసుపై విచారిస్తుండగా గతంలో చోరీ చేసిన బంగారం, వెండిని మహారాష్ట్రకు చెందిన మంగేష్, నౌషాద్  రైస్ అనే వ్యక్తులకు విక్రయించినట్లు వెల్లడించారనీ, ఇప్పటివరకు మొత్తం 10 తులాల బంగారం, 50 తులాల వెండి, రూ.1,100 నగదు, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని స్పష్టం చేశారు. ఈ కేసుల ఛేదనలో మద్నూర్ ఎస్ఐ మోహన్ రెడ్డి తో పాటు మద్నూర్ కానిస్టేబుళ్లు విఠల్, విష్ణు, సిసిఎస్ కానిస్టేబుళ్లు గణపతి , రాజేందర్, శ్రీనివాస్, లక్ష్మీకాంత్, రవి చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించారని బిచ్కుంద సీఐ రవికుమార్ వెల్లడించారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్