Magazines

'తులాభారం'తో వస్తున్న మాస్ మహారాజా..!

1 గంట క్రితం

Thulabaram
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 11, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : మాస్ మహారాజా రవితేజ, విభిన్న చిత్రాల దర్శకుడు వివేక్ ఆత్రేయ కలయికలో రాబోతున్న కొత్త సినిమా టైటిల్‌ను చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్రానికి ‘తులాభారం’ అనే ఆసక్తికర టైటిల్‌ను ఖరారు చేస్తూ, ఒక ప్రత్యేకమైన టైటిల్ డాక్యుమెంటరీని విడుదల చేసింది. ఈ వినూత్న ప్రకటనతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. వివేక్ ఆత్రేయ తనదైన శైలిలో కథను సిద్ధం చేయగా, రాక్‌స్టార్ వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. రవితేజ మార్క్ ఎనర్జీ, వివేక్ ఆత్రేయ సృష్టించే బలమైన పాత్రలు కలిసి ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజాగా విడుదల చేసిన ‘తులాభారం’ టైటిల్ డాక్యుమెంటరీ సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచుతోంది. ఇందులో చిత్ర నిర్మాణం, నేపథ్యానికి సంబంధించిన కొన్ని విశేషాలను పంచుకున్నారు.

ఈ సినిమాలో రవితేజ సరసన ప్రియాంక మోహన్, అనశ్వ‌ర రాజన్ కథానాయికలుగా నటిస్తుండగా, జేడీ చక్రవర్తి, తరుణ్ భాస్కర్ కీలక పాత్రలు పోషించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని చిత్ర బృందం పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్