నవతెలంగాణ - హైదరాబాద్ : ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను సవాల్ చేస్తూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సరైన నిబంధనలు పాటించకుండా పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారని పిటిషన్లో ఆరోపించారు. ఈ ప్రక్రియపై తక్షణమే స్టే విధించాలని కోరారు. ఒవైసీ తరఫున న్యాయవాది నిజాముద్దీన్ పాషా వాదనలు వినిపిస్తూ, ఇతర పిటిషన్లతో కలిపి తమ పిటిషన్ను కూడా విచారించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోరారు. దీనిపై పరిశీలిస్తామని సీజేఐ తెలిపారు. ఫారం-6 దరఖాస్తులకు సంబంధించిన మ్యాపింగ్ నిబంధనలు ఓటర్లకు భారంగా ఉన్నాయని ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే రాహుల్ గాంధీ సహా పలువురు ప్రతిపక్ష నేతలు ఎస్ఐఆర్పై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లతో కలిపి ఒవైసీ పిటిషన్ను కూడా విచారించే అవకాశం ఉంది.
ఎస్ఐఆర్పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఒవైసీ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 14, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)