నవతెలంగాణ-హైదరాబాద్: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వరుస ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు, సీజేపీ, యువత జంతర్ మంతర్ వద్ద పలు రోజులుగా నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు నిరసనలకు అనుమతించిన ప్రదేశాల్లో ఒకటైన జంతర్ మంతర్‌ను ఆ జాబితా నుంచి తొలగించారు. ఇకపై అక్కడ నిరసనలు, ఆందోళనలు నిర్వహించేందుకు అనుమతి ఉండదని అధికారిక నోటీసులో పేర్కొన్నారు. ఢిల్లీలో నిరసనలు నిర్వహించేందుకు ప్రత్యామ్నాయంగా మూడు ప్రాంతాలను పోలీసులు సూచించారు. రామ్‌లీలా మైదాన్, బురారీ మైదాన్, తూర్పు ఢిల్లీలోని సీబీడీ గ్రౌండ్‌లను నిరసనలకు వేదికలుగా వినియోగించుకోవచ్చని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
జంతర్ మంతర్ వద్ద ఆందోళనలకు అనుమతి లేదు
57 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 12, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)