Magazines

కేంద్ర రైల్వే, జలశక్తి శాఖ సహాయ మంత్రికి నిరసన సెగ

1 గంట క్రితం

Union Minister
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్ర రైల్వే, జలశక్తి శాఖ సహాయ మంత్రి వి.సోమన్న సోమవారం కర్నాటక పర్యటనలో నిరసన సెగ తగిలింది. శివమొగ్గ నగరంలోని బి.హెచ్. రోడ్డులోని అశోక సర్కిల్ సమీపంలో యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు కేంద్ర మంత్రికి నల్ల జెండాలతో నిరసన తెలిపారు.

ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR)కు వ్యతిరేకంగా కేంద్రానికి నిరసనగా, వినాయక్ మాల్ సమీపంలో ఆయన కాన్వాయ్ వెళుతుండగా యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు కాన్వాయ్‌ను అడ్డుకుని నల్ల జెండాలు ఊపారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్