Magazines

సీఎస్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు, అధికారులు

1 గంట క్రితం

the CS video conference
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 12, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-జన్నారం

ఎల్-నినో ప్రభావం, కరువు నివారణ చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు నిర్వహించిన రాష్ట్ర స్థాయి వీడియో కాన్ఫరెన్స్‌కు జన్నారం రైతు వేదిక నుంచి స్థానిక కాంగ్రెస్ నాయకులు, వ్యవసాయ అధికారులు, రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎల్-నినో ప్రభావం వల్ల ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.


ప్రస్తుత పరిస్థితుల్లో నీటి వినియోగం ఎక్కువగా ఉండే వరి పంటకు బదులుగా రైతులు ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు. తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించేందుకు వీలుగా జొన్నలు, మొక్కజొన్న, పెసర్లు, మినుములు, సజ్జలు వంటి పంటలను సాగు చేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ అధికారులు కూడా రైతులకు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి అవసరమైన సాంకేతిక సలహాలు అందించాలని కోరారు.


ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నందు నాయక్, వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ లక్ష్మినారాయణ, పట్టణ అధ్యక్షులు మంద రాజేష్, మాజీ ఎంపీపీ మచ్చ శంకరయ్య, టీపీసీసీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హేమంత్ చారి, వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు) సయ్యద్ అక్రముల్లా, బాదావత్ అఖిల్ తో పాటు పలువురు స్థానిక రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్