Magazines

ఫిర్యాదులపై తక్షణం స్పందించాలి

1 గంట క్రితం

complaints
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 12, 2026 | 1 నిమిషాల చదవడం

- ఆకస్మిక ఠాణా సందర్శనలో సీపీ రష్మీ పేరుమాళ్ సూచన

నవతెలంగాణ - బెజ్జంకి

తమ సమస్యలపై ప్రజలు ఠాణాలో అందించే పిర్యాదులపై తక్షణం స్పందించాలని సీపీ సాధన రష్మీ  పేరుమాళ్ సిబ్బందికి సూచించారు. సోమవారం సీపీ రష్మీ పేరుమాళ్ మండల కేంద్రంలోని ఠాణాను ఆకస్మికంగా సందర్శించారు. ఠాణా పరిసరాలను పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటుచేయనున్న పెట్రోల్ బంక్ పిర్యాదుపై సీఐ విద్యాసాగర్, ఎస్ఐ తోట తిరుపతితో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించి వివరాలడిగి తెలుసుకున్నారు.

ఇథనాళ్ పరిశ్రమ పరిసరాల పరిశీలన..

మండల పరిధిలోని పోతారం గ్రామ శివారులోని ఇథనాళ్ పరిశ్రమ పరిసరాలను సీపీ రష్మీ పేరుమాళ్ సందర్శించి పరిశీలించారు. పరిశ్రమకు రాకపోకలు సాగించే భారీ వాహనాల వల్ల ఇబ్బందులు పడుతున్నామని, సమస్యను పరిష్కరించాలని కోహెడ మండలం శంకర్ నగర్ గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు సీపీకి వినతిపత్రమందజేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్