Magazines

సుప్రీంకోర్టు వైపు భారీ ర్యాలీ

1 గంట క్రితం

Central Delhi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ, ఇండియా బ్లాక్ బ్యానర్ కింద వేలాది మంది రాజకీయ కార్యకర్తలు, పౌర హక్కుల కార్యకర్తలు సుప్రీంకోర్టుకు పాదయాత్ర చేపట్టారు. దీంతో బారికేడ్లు, భారీ పోలీసు బందోబస్తుతో సెంట్రల్ ఢిల్లీ జనసంద్రంగా మారింది. రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, అఖిలేష్ యాదవ్ వంటి నాయకుల నేతృత్వంలో జరిగిన 'ప్రజాస్వామ్యం కోసం పాదయాత్ర', బారాఖంబా రోడ్, మండి హౌస్‌తో సహా రాజధానిలోని కీలక ప్రాంతాలను స్తంభింపజేసింది. ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR)లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ నిరసనకారులు జాతీయ జెండాలను ఊపుతూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్