నవతెలంగాణ - హైదరాబాద్ : భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ-యూకే విభాగం లండన్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించింది. భారత్‌లో ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులు, కార్యకర్తలపై పోలీసుల చర్యలను ఖండిస్తూ నినాదాలు చేశారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు, ఓట్ల తొలగింపులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో నిరసనకారులపై లాఠీచార్జ్ చేసి, పలువురిని అదుపులోకి తీసుకున్నారని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆరోపించారు. భారత్‌లో జరుగుతున్న ఆందోళనలకు మద్దతుగా ఈ నిరసన చేపట్టినట్లు తెలిపారు.
లండన్‌లో ఎస్‌ఎఫ్‌ఐ నిరసన.. సీఈసీ రాజీనామాకు డిమాండ్
2 గంటల క్రితం

SFI protest in London.. Demand for CEC's resignation
వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 12, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)