Magazines

బీజేపీ ప్రభుత్వాన్ని దేశ ప్రజలు క్ష‍మించరు: సీఎం రేవంత్‌రెడ్డి

1 గంట క్రితం

Cm Revanth Reddy
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 07, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: ఎన్నికల సంఘం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరుపై సీఎ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లను లక్ష్యంగా చేసుకుని కుట్ర పన్నారని, ప్రజల ఓటు హక్కును ఈసీ హరిస్తోందని ఆయన ఆరోపించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన రాహుల్ గాంధీ ఉన్న పీఎస్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అయిన ఓటు హక్కును కొల్లగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు.

దేశంలో చేపడుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నిబంధనల పేరుతో అన్యాయంగా తొలగించిన ఓట్లన్నింటినీ మళ్లీ ఓటరు జాబితాల్లో చేర్చాలని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించే వరకు ప్రభుత్వపరంగా, పార్టీపరంగా పోరాటం కొనసాగుతుందని తేల్చిచెప్పారు. అదేవిధంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ క్షమించరని సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్