Thursday, October 30, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనకిలీ దంత వైద్యులపై చర్యలు తీసుకోండి

నకిలీ దంత వైద్యులపై చర్యలు తీసుకోండి

- Advertisement -

– డెంటల్‌ కౌన్సిల్‌ రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

నకిలీ దంత వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఆల్‌ ఇండియా డెంటల్‌ స్టూడెంట్స్‌ అండ్‌ సర్జన్స్‌ అసోసియేషన్‌ (ఎయిడ్సా) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు అసోసియేషన్‌ జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ మహ్మద్‌ మంజూర్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో నాయకులు తెలంగాణ డెంటల్‌ కౌన్సిల్‌ రిజిస్టార్‌కు ఫిర్యాదు చేశారు. అర్హత లేని వారు చట్ట విరుద్ధంగా నడుపుతున్న క్లినిక్‌లపై వెంటనే చర్యలు తీసుకోవాలనీ, నకిలీలకు సహకరిస్తున్న డెంటిస్టుల బీడీఎస్‌, ఎండీఎస్‌ డిగ్రీలను రద్దు చేయాలని వారు కోరారు. అనంతరం వారు హైదరాబాద్‌లోని ప్రభుత్వ దంత కళాశాల ప్రిన్సిపాల్‌తో సమావేశమై నకిలీ దంత వైద్యంతో ఎదురవుతున్న సమస్యలను చర్చించారు. నకిలీ దంత వైద్యానికి బలికాకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని వారు కోరారు. ఎయిడ్సా చేస్తున్న పోరాటానికి దంత వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ మద్ధతు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -