Wednesday, December 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డీఈఓ, డీవైఎస్ఓ లపై చర్యలు తీసుకోండి..

డీఈఓ, డీవైఎస్ఓ లపై చర్యలు తీసుకోండి..

- Advertisement -

విద్యాశాఖ డైరెక్టర్ కు కరాటే మాస్టర్ల వినతి 
నవతెలంగాణ – దుబ్బాక 

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు కరాటే విద్యలో శిక్షణ ఇచ్చే విషయంలో డీఈవో, డీవైఎస్ఓ లు..  ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ఇదివరకే ప్రొసీడింగ్ లో ఉన్న కరాటే మాస్టర్లను తొలగించి వారి స్థానంలో వేరే మాస్టర్లను నియమించారని యువ స్పోర్ట్స్ కరాటే అకాడమీ తెలంగాణ వ్యవస్థాపకులు, కరాటే మాస్టర్ బురాని శ్రీకాంత్ ఆరోపించారు. స్థానికేతరు లను సిద్దిపేట జిల్లాలో మాస్టర్ గా నియమిస్తూ స్థానికులైన ఇక్కడి కరాటే మాస్టర్లకు అన్యాయం చేస్తున్నారన్నారు. చట్టపరంగా వీరిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈ. నవీన్ నికోలస్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. సీనియర్ కరాటే మాస్టర్లు దేవులపల్లి శ్రీనివాస్, కంటె రాజు పలువురున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -