ట్రంప్‌ను కోరనున్న నెతన్యాహూ
జెరుసలేం : ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఈ నెల 29న మార్-ఏ-లాగోలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఆయన ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యకలాపాలపై ఆందోళన వ్యక్తం చేసే అవకాశం ఉంది. గతంలో జరిపిన దాడుల కారణంగా దెబ్బతిన్న అణు కేంద్రాలను ఇరాన్ పునర్నిర్మిస్తోందని, క్షిపణుల ఉత్పత్తిని ప్రారంభిస్తోందని, కాబట్టి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ట్రంప్‌ను కోరతారు. కొన్ని నెలల క్రితం ఇజ్రాయిల్ జరిపిన దాడిలో ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి కొంత నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. ఇప్పుడు క్షిపణుల ఉత్పత్తిని ఇరాన్ తిరిగి వేగవంతం చేస్తున్నట్లు కన్పిస్తోందని ఇజ్రాయిల్ అధికారులు చెప్పారు. అవసరమైతే అందుబాటులో ఉన్న సైనిక చర్యలను పరిశీలించాల్సిందిగా ట్రంప్‌ను ఇజ్రాయిల్ కోరుతుందని అమెరికా మాజీ అధికారులు అభిప్రాయపడ్డారు. జూన్‌లో అమెరికా చేపట్టిన చర్య కారణంగా దెబ్బతిన్న అణు స్థావరాలను పునరుద్ధరించేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోందని ఇజ్రాయిల్ అనుమానిస్తోంది.
ఇరాన్‌పై చర్యలు తీసుకోండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



