జిల్లాల ఎస్పీలు, నగర సీపీలకు డీజీపీ ఆదేశం
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
మునిసిపల్ ఎన్నికల సందర్భంగా విధుల్లో ఉన్న పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులపై చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లాల ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లను డీజీపీ శివధర్‌రెడ్డి శుక్రవారం ఆదేశించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ… రాజ్యాంగం ప్రకారం ఎన్నికల విధులను నిబంధనల ప్రకారం అందుకు నియోగించబడ్డ ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు అధికారులు నిర్వహిస్తారని అన్నారు. ప్రజాస్వామ్యంలో నిర్భయంగా ఓటర్లను ఓటు వేయడానికి అవసరమైన శాంతియుత వాతావరణాన్ని వీరు కల్పిస్తారని ఆయన చెప్పారు. అటువంటి చట్టబద్ధమైన విధుల్లో ఉన్న ప్రభుత్వాధికారులు, పోలీసు అధికారుల పట్ల దురుసుగా వ్యవహరించడం, బెదిరింపులకు పాల్పడటం వంటి చట్ట వ్యతిరేక పనులకు ఎవరు పాల్పడినా సహించబోమని తెలిపారు. ఆ విధంగా ప్రవర్తించే వారు సామాన్యులైనా, ప్రజాప్రతినిధులైనా, వారు ఎంతటి ప్రభావవంతులైనా చట్టానికి అతీతం కారని ఆయన స్పష్టం చేశారు. ఆ విధంగా వ్యవహరించిన వారిపై కేసులు నమోదు చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లాల ఎస్పీలు, నగర సీపీలను ఆదేశించినట్టు డీజీపీ తెలిపారు.
ఎన్నికల సిబ్బందిని బెదిరించిన వారిపై చర్యలు తీసుకోండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



