Tuesday, November 4, 2025
E-PAPER
Homeఖమ్మంఅనుమతి లేకుండా మట్టిని తరలిస్తే చర్యలు చేపట్టండి

అనుమతి లేకుండా మట్టిని తరలిస్తే చర్యలు చేపట్టండి

- Advertisement -

– తహశీల్దార్ కు మైనింగ్ ఏడీ దినేష్ కుమార్ ఆదేశాలు
నవతెలంగాణ – అశ్వారావుపేట

మైనింగ్ శాఖ అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలించినా,అక్రమ మట్టి రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని గనులు – భూగర్భ శాఖ సహాయ సంచాలకులు దినేష్ కుమార్ స్థానిక తహశీల్దార్ సీ.హెచ్.వీ రామక్రిష్ణ కు ఆదేశాలు ఇచ్చారు.

జిల్లా కలెక్టర్ రితేష్ వి. పాటిల్ ఆదేశాల మేరకు సోమవారం ఆయన తహసీల్దారు రామక్రిష్ణ తో కలిసి ఇటీవల అశ్వారావుపేట గ్రామ రెవిన్యూ పరిది లో మట్టి త్రవ్వకాలు జరిపిన ప్రదేశాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించి విచారణ చేపట్టారు. త్రవ్వకాలు జరిపిన మట్టిని మండల స్థాయిలో వివిధ అభివృద్ధి పనుల నిమిత్తము మట్టి సరఫరా జరిగినట్లు విచారణలో గుర్తించారు. 

ఎవరైనా పట్టా భూమిలో మట్టి త్రవ్వకాలు జరిపినా దానికి సదరు పట్టాదారు పూర్తీ బాధ్యత వహించవలసి ఉంటుంది అని హెచ్చరించారు. ఈ త్రవ్వకాలు అలాగే కొనసాగితే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి సదరు పట్టాను రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు.

జిల్లాలో పోలిస్, రెవిన్యూ & మైనింగ్ శాఖలు సమన్వయంతో పని చేస్తూ ముందుకు పోతున్నాయని ఏడీ జి.దినేష్ కుమార్ తెలిపారు అలాగే ఇటుక బట్టీ ల గురించి సంబంధిత రెవిన్యూ అధికారులు జారి చేసే నాలా సర్టిఫికేట్ తప్పని సరి అని అన్నారు.అక్రమ మట్టి త్రవ్వకాలు వెంటనే ఆపివేయాలని తెలిపారు.ఇక పై తమ దృష్టికి వచ్చిన వెంటనే కఠిన చర్యలు తప్పవని అన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -