అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించిన సర్పంచ్
నవతెలంగాణ – నెల్లికుదురు
అంగన్వాడి సెంటర్లు దొరికే పౌష్టిక ఆహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ గ్రామ సర్పంచ్, ఆరోగ్య లక్ష్మి కమిటీ చైర్మన్ మాధరి ప్రశాంత్ అన్నారు. గురువారం అంగన్వాడి కేంద్రాలను సందర్శించి పరిశీలించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాయి అన్నారు.
ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా పూర్వ ప్రాథమిక విద్య అందించడంతో పాటు పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తున్నాయి అన్నారు . కానీ సరైన అవగాహన లేకపోవడం, పేదరికం కారణంగా చాలా మంది పోషకాహార లోపంతో పలు రుగ్మతల బారిన పడుతున్నారు అని తెలిపారు.పేద ప్రజలకు ఇలాంటి లోపాలు జరగకుండా అంగన్వాడీ టీచర్స్ అవగాహనా కల్పించాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ మద్దెల కనకతారా,దుండ్ర సుజాత, గాజుల ఇందిరా, మరియు ఆయలు పాల్గొన్నారు.



