Sunday, November 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -
  • రక్షిత ఉచిత కంటి వైద్య శిబిరంలో ఒగ్గు దామోదర్
  • నవతెలంగాణ-బెజ్జంకి
  • ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ సూచించారు. ఆదివారం మండల కేంద్రంలో రక్షిత కేర్ ఆస్పత్రి అధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఒగ్గు దామోదర్, మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి కలిసి ప్రారంభించారు. డాక్టర్ సాగర్ కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. భవిష్యత్తులో ఉచిత గుండె పరీక్షలు నిర్వహించడానికి సన్నాహకాలు చేస్తున్నామని డాక్టర్ తెలిపారు. ఆలయ చైర్మన్ జెల్ల ప్రభాకర్,బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు లింగాల శ్రీనివాస్,ఏఎంసీ డైరెక్టర్ బోనాల మల్లేశం,నాయకులు రొడ్డ మల్లేశం,బైర సంతోష్,బొనగం రమేష్,ఇష్కిళ్ళ ఐలయ్య,ఐలేని మహేందర్ రెడ్డి,ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -