పోస్టల్ బీమా చెక్కుకు పంపిణీ
నవతెలంగాణ – నసురుల్లాబాద్
పోస్టల్ ఇన్సూరెన్సు చేసుకుంటే వాటివల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయని బోధన్ సబ్ డివిజన్ ఇన్స్ పెక్టర్ ప్రకాష్ సూచించారు. శనివారం బాన్సువాడ నియోజకవర్గంలోని నసురుల్లాబాద్ మండలం లోని మీర్జాపూర్ గ్రామం ఉన్న పోస్టాఫీసును సందర్శించారు. మిర్జాపూర్ గ్రామంలో 2024లో మృతి చెందిన సల్పిడి హన్మండ్లు ఉపాధ్యాయుడు మృతి చెందడంతో వారి నామినీ భార్య సబ్బిడి జయశ్రీకి 5 లక్షల 26 వేల రూపాయల పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ చెక్కును మిర్జాపూర్ పోస్టల్ ఎస్ పీఎం గంగాధర్, గ్రామస్థుల సమక్షంలో అందజేశారు.
ఈ సందర్భంగా ఐపీఓ ప్రకాష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలు రైతులు పోస్టల్ శాఖ అందించే వివిధ బీమా పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని, విద్యార్థులు పోస్టల్ కార్యాలయంలో రూ. 250తో ఖాతాలు తెరుచుకోవచ్చన్నారు. వారికి స్కాలర్‌షిప్‌ల కోసం పోస్టల్ శాఖ ఎంతగానో పనిచేస్తుందన్నారు. ఇతరులు ఎవరైనా పోస్టల్‌లో ఖాతాలు తీస్తే వారికి ఫోన్‌పే, గూగుల్ పే కూడా పని చేస్తాయన్నారు. కేవలం ఒక సంవత్సరం ప్రీమియం చెల్లించినా పూర్తి బోనస్ కూడిన మొత్తాన్ని పొందడం పోస్టల్ శాఖ ప్రత్యేకత అని వివరించారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ సిబ్బంది రూపేష్ , సూర్యకాంత్, గ్రామస్తులు జంగిలి శ్రీనివాస్, బంజే నాగనాథ్, బి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.