కొడకండ్ల ఏఎంసీ చైర్మన్ నల్ల అండాలు
నవతెలంగాణ – పెద్దవంగ
ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకుని, ఆర్థికంగా ఎదగాలని కొడకండ్ల ఏఎంసీ చైర్మన్ నల్ల అండాలు అన్నారు. సోమవారం మండల కేంద్రంలో శ్రీలక్ష్మి (ఐకేపీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, ఏవో గుగులోత్ స్వామి నాయక్, ఏపీఎం ఎండీ పాషా తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని సూచించారు. సన్న వడ్ల కు ప్రభుత్వం క్వింటాళ్ల కు రూ.500 అదనంగా బోనస్ ఇస్తుందన్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి, గరిష్ట మద్దతు ధర పొందాలన్నారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కొనుగోలు కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ బానోత్ గోపాల్ నాయక్, ముత్యాల పూర్ణచందర్, ఆర్ఐ భూక్యా లష్కర్, గ్రామ ప్రత్యేకాధికారి బుధారపు శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు రంగు మురళి, పొడిశెట్టి సైదులు, దుంపల శ్యాం, డాక్టర్ రవీందర్ రెడ్డి, చిలుక దేవేంద్ర, బోనగిరి లింగమూర్తి, గద్దల ఉప్పలయ్య, జాటోత్ వెంకన్న, చిలుక సంపత్, వినోద్, ప్రవీణ్, అకౌంటెంట్ అనిల్, వీవోఏ లు రఘుపతి, వసంత, మణెమ్మ, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



