నవతెలంగాణ – బజార్హత్నూర్
మండల రైతులు ప్రభుత్వము అందించే ఉచిత గాలికుంటూ టీకాల ను సద్వినియోగం చేసుకోవాలని మండల పశువైద్యాధికారి పర్వీజ్ హైమాద్ అన్నారు. మంగళవారం మండలంలోని గిర్నూర్ గ్రామంలో గో జాతి, గేద జాతి పశువులకు ఉచిత గాలికుంటు టీకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైతు తప్పనిసరిగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను తమ పశువులకు వేయించుకోవాలని లేనిపక్షంలో పశువులు ప్రమాదకరమైన గాలికుంటు వ్యాధి సోకి మరణించే ప్రమాదం ఉందన్నారు.
పాలిచ్చే గేదెలకు ఆవులకు గాలికుంటు వ్యాధి సోకినట్లయితే పాలు పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉందని అన్నారు సూడి కట్టిన పశువులు గాలుకుంటి వ్యాధి సోకినట్లయితే కడుపులో దూడలు చనిపోయే ప్రమాదం ఉందన్నారు . అందువల్ల రైతులు గాలికుంటు వ్యాధి సోకిన పశువును సకాలంలో గుర్తించి మిగతా పశువులతో దూరంగా ఉంచాలని వెంటనే పశువైద్యశాలకు తోలుకువచ్చి వైద్యం చేయించాలని అన్నారు ప్రస్తుతం గాలికుంటు వ్యాధి లో కాకుండా ముందస్తుగా టీకాలు వేస్తున్నామని రైతులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పూసల ప్రియాంక, ఉప సర్పంచ్ రాజేందర్, గ్రామస్తులు భుమేష్, రైతులు పాల్గోన్నారు.



