Thursday, May 15, 2025
Homeతెలంగాణ రౌండప్పునరుత్పత్తి వైద్య ఫెలోషిప్ సర్టిఫికెట్ కోర్సును సద్వినియోగం చేసుకోవాలి

పునరుత్పత్తి వైద్య ఫెలోషిప్ సర్టిఫికెట్ కోర్సును సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -

విష్ ఫెర్టిలిటీ ఐవీఎఫ్ అకాడమీ పునరుత్పత్తి వైద్యంలో ఐఎంఏ-ఫెలోషిప్ సర్టిఫికేట్ కోర్సు ప్రారంభం
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
: 2025-26 సంవత్సరానికి పునరుత్పత్తి వైద్య రంగంలో ఆశావహుల కోసం పునరుత్పత్తి వైద్య ఫెలోషిప్ సర్టిఫికెట్ కోర్సును సద్వినియోగం చేసుకోవాలని ఆదర్శ ప్రసూతి హోం డాక్టర్ కె.ఎస్. స్వామి, విష్ ఫెర్టిలిటీ డాక్టర్ కిరణ తెలియజేశారు. ఈ మేరకు సోమవారం రాత్రి నగరంలోని ద్వారకా నగర్ ఖలీల్ వాడిలో గల విష్ ఫెర్టిలిటీ హాస్పిటల్ విష్ ఫెర్టిలిటీ ఐవీఎఫ్ అకాడమీ పునరుత్పత్తి వైద్యంలో ఐఎంఏ-ఫెలోషిప్ సర్టిఫికేట్ కోర్సు (ఐఎంఏ-ఏఎంఎస్, ప్రధాన కార్యాలయం, తెలంగాణ ఆమోదం) ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆదర్శ ప్రసూతి హోం, కోర్స్ కోఆర్డినేటర్ డాక్టర్ కె.ఎస్. స్వామి మాట్లాడుతూ.. విష్ ఫెర్టిలిటీ పునరుత్పత్తి వైద్య ఫెలోషిప్ సర్టిఫికెట్ కోర్సును ప్రారంభిస్తున్నామని రోజురోజుకు ఇన్ ఫెర్టిలిటీ ప్రాబ్లం పెరుగుతుంది. అందులో మంచి పరిమితి, మంచి నాలెడ్జ్, మంచి డాక్టర్లు ఉండాలి. ఇంతకుముందు ఈ కోర్స్ కోసం హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, వెళ్లి రూమ్ తీసుకొని డబ్బులు ఖర్చు పెట్టుకుని కోర్స్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు మనకు విష్ పార్టీ లిటిల్ లోనే ట్రైనింగ్ సెంటర్ ఐఎంఏ అకాడమీతో అనుమతి డాక్టర్ కిరణ నేతృత్వంలో కొనసాగుతుందని తను సైతం అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయి శిక్షణ తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. విష్ ఫెర్టిలిటీ ఐవీఎఫ్ అకాడమీ పునరుత్పత్తి వైద్యంలో ఐఎంఏ-ఫెలోషిప్ సర్టిఫికేట్ కోర్సు ను నేర్చుకొని నిజామాబాద్ ప్రజలకు మంచి సేవలు అందించాలని సూచించారు. అనంతరం విష్ పర్టిలిటీ హాస్పిటల్ డాక్టర్ కిరణ మాట్లాడుతూ.. ఒక డాక్టర్ ఎం ఎస్ ( ప్రసూతి శాస్త్రం అండ్ గైనకాలజీ ) పూర్తిచేసిన తర్వాత, గర్భం దాల్చలేక పోతున్న మహిళల (లేదా పురుషుల) సమస్యలపై ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాలనుకుంటే, వాళ్లు ఇన్‌ఫెర్టిలిటీ ఫెలోషిప్ చేస్తారు అని తెలిపారు.
ఈ శిక్షణలో డాక్టర్లు గర్భధారణ ఎందుకు అవడం లేదో గుర్తించే పద్ధతులు (పరీక్షలు), సైన్స్ ఆధారంగా తగిన మందులు, చికిత్సలు ఎలా ఇవ్వాలో, ఐ వి ఎఫ్, ఐ యు ఐ, వంటి అగ్రవైద్య విధానాలు ఎలా చేయాలో,పురుషుల, మహిళల ఉరితల సమస్యల పరిష్కారం వంటివి నేర్చుకుంటారని తెలిపారు.నేటి కాలంలో చాలా జంటలు గర్భం దాల్చలేక ఇబ్బంది పడుతున్నారు. సాధారణ వైద్యుడికి కొన్ని అడ్వాన్సుడ్ చికిత్సలు తెలిసి ఉండకపోవచ్చు, ఈ ఫెలోషిప్ ద్వారా డాక్టర్ మ‌రింత నిపుణుడిగా మారుతాడు. మరింత అధునాతన చికిత్సలు ఇవ్వగలుగుతాడు అందుకే ఈ కోర్స్ అవసరమన్నారు. సాధారణంగా ఈ కోర్సు 6 నెలల నుంచి 1 సంవత్సరాలుఉంటుంది. కొన్నిసార్లు హాస్పిటల్స్ లేదా మెడికల్ సంస్థల ద్వారా నిర్వహిస్తారన్నారు. అలాంటి అవకాశం తనకు రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న వైద్యులకు అందుబాటులో విష్ పర్టిలిటీలో విష్ ఫెర్టిలిటీ ఐవీఎఫ్ అకాడమీ పునరుత్పత్తి వైద్యంలో ఐఎంఏ-ఫెలోషిప్ సర్టిఫికేట్ కోర్సు ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జూన్ 1వ తేదీ2025  నుండి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. కోర్స్ నేర్చుకోవడానికి ఫీజు సంవత్సరానికి 75 వేల రూపాయలు ఐఎంఏ హైదరాబాద్ కు చెల్లించాలని తెలిపారు. ఈ శిక్షణా తరగతులు విష్ ఫర్టిలిటీ హాస్పిటల్లో నడుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ విక్రం రెడ్డి, ఎన్ ఓ జి ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ మల్లేశ్వరి, డాక్టర్ శైలజ, నిజాంబాద్ నగరంలోని వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -