నేడు ఉచిత కంటి వైద్య శిబిరం
హాజరుకానున్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి
నవతెలంగాణ – పాలకుర్తి
ఉచిత కంటి వైద్య శిబిరాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్ లు కోరారు. మంగళవారం వారు మాట్లాడుతూ మండల కేంద్రంలో గల బషారత్ గార్డెన్ లో హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్టు, శంకర్ కంటి ఆసుపత్రి, జిల్లా అందత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరానికి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డిలు హాజరవుచున్నారని తెలిపారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం వరకు కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తారని తెలిపారు. ప్రజలకు కంటి చూపును అందించే విధంగా ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డిలు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



