Thursday, August 28, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్దాతల సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి

దాతల సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -

మండల విద్యాశాఖ అధికారి నాగవర్థన్ రెడ్డి..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  
: దాతలు  సహృదయంతో అందించే సాయాన్ని, విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని భువనగిరి మండల విద్యాధికారి నాగవర్థన్ రెడ్డి కోరారు. సోమవారం భువనగిరి మండలం యర్రంబెల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు, హైదరాబాద్ వైశ్య భవన్ వారి సహకారంతో అందించిన నోట్ బుక్స్, బ్యాగులను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన ఊరు – మన బడి, బడిబాట కార్యక్రమంలో దాతలు, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన అన్నారు.

హైదరాబాద్ వైశ్య భవన్ ట్రస్ట్ సభ్యులు ఎస్  రామేశ్వరం, బలరాం, కార్యదర్శి రవీంద్రనాథ్ గుప్తా, డిస్ట్రిక్ట్ అకాడమిక్ కో- ఆర్డినేటర్ శ్రీహరి అయ్యంగార్ విద్యార్థులకు నోట్ బుక్స్,టై, బెల్ట్, బ్యాగులను,  ప్లేట్, గ్లాసులు విద్యార్థులకు అందజేశారు. ప్రాథమిక పాఠశాలలో వంటగది నిర్మాణం కోసం దాత రిటైర్డ్ ప్రొఫెసర్ సోలిపురం మధుసూదన్ రెడ్డి,  పాఠశాలకు సౌండ్ సిస్టం ను గ్రామానికి చెందిన గొర్ల వైకుంఠం లు అందజేశారు.  ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి హేమలత, పాఠశాల అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ కలకొండ సరిత, ప్రధానోపాధ్యాయులు వి. శ్రీనివాసులు, పాఠశాల ఉపాధ్యాయులు రాజు, వరలక్ష్మి,రజిత, అంగన్వాడీ టీచర్ శైలజ, ఆశావర్కర్ జ్యోతి, గ్రామ మాజీ సర్పంచ్ యశోద, గ్రామస్తులు, గొర్ల వైకుంఠం, మోహన్ రెడ్డి, నాళ్ళ చంద్రం,లు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad