Saturday, April 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన సంతను సద్వినియోగం చేసుకోండి 

నూతన సంతను సద్వినియోగం చేసుకోండి 

- Advertisement -

బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో నూతన అంగడి (సంత ) ఏర్పాటు
బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామ సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్ 
నవతెలంగాణ – నెల్లికుదురు 

మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో రేపు ప్రారంభమై అంగడి ( సంతా) లో తక్కువ ధరల దొరికే ప్రతి వస్తువును సద్వినియోగం చేసుకోవాలని ఆ గ్రామ సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ మన గ్రామంలో ఆదివారం నూతనంగా అంగడి (సంత) ఏర్పాటు చేయడం జరుగుతుంది అని అన్నారు.

ఇందులో గ్రామ ప్రజలకు అవసరమైన నిత్యవసర వస్తువులు, కూరగాయలు అందుబాటులో ఉంటాయి కావున గ్రామ ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లి సరుకులు కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా మన ఊరిలోనే అందుబాటులో ఉండే కూరగాయలు ఇతర నిత్య అవసరాలు కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామని గ్రామపంచాయతీ పాలకవర్గం తరుపున సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -