– మండల పశు వైద్య శాఖ..
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని నడింపల్లి, పెద్ద ఎడ్గి గ్రామపంచాయతీలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు ఉచిత గాలికుంట వ్యాధి నిరోధక టీకాలు వేయడం జరిగిందని మండల వెటర్నరీ డాక్టర్ పండరినాథ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఏడ్గి గ్రామ సర్పంచ్ అనిల్ కుమార్ , పడంపల్లి గ్రామ సర్పంచ్ వాగ్మారే విజయ కుమారి సంజు పాల్గొన్నారు. పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి టీకాలు ఇచ్చి కార్యక్రమాన్ని ఆయా గ్రామాల సర్పంచిల చేతుల మీదుగా టీకాలు వేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో సర్పంచులు మాట్లాడుతూ గ్రామాలలో పశుసపాద పెరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత గాలి గుంటూరు వ్యాధి టీకాలను పాడి పశువులు కలిగిన ప్రతి రైతు సద్వినియోగపరచుకోవాలని అన్నారు.
గాలికుంటు వ్యాధి సోకితే పశువులు చనిపోయే అవకాశాలు మెండుగా ఉంటాయని అన్నారు. గాలికుంటు వ్యాధి వలన పశువులకు ఆహారం తినకపోవడం, నోటి ద్వారా జిగురు లాంటి సొల్లు కారడం, కాళ్ల గిట్టలు మెత్తబడిపోవడం, పశువులు నడవలేక పోయాయని తెలిపారు. పశువులకు జ్వరం వస్తుందని బలహీనంగా మారి మృత్యువాత పడతాయని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పశువైద్య అధికారి పండరి నాథ్, గ్రామ పెద్దలు రామనాథ్, పండారి, గోపాల మిత్ర సభ్యులు అంజయ్య, రవి, తదితరులు పాల్గొన్నారు.



