నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రం నుండి జగిత్యాల జిల్లా మెట్ పల్లి వెళ్లే దారిలో ఉన్న శ్రీ రామాంజనేయ పిరమిడ్ ధ్యాన మందిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిరమిడ్ మాస్టర్ మురళి గౌడ్ కోరారు. రోడ్డుకు కొద్ది దూరంలో ఉన్న పిరమిడ్ ధ్యాన మందిరం అందరికీ తెలిసేలా 63వ నంబర్ జాతీయ రహదారి పక్కన శుక్రవారం బోర్డును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిరమిడ్ ధ్యాన మందిరానికి ఎవరైనా వచ్చి ఉదయం నుండి సాయంత్రం వరకు ఉచితంగా ధ్యానం చేసుకోవచ్చని తెలిపారు. ఈ విషయం అందరికీ తెలిసేలా చేయాలన్న ఉద్దేశంతో రోడ్డు ప్రక్కన ఒక బోర్డు ఏర్పాటు చేసామన్నారు. పిరమిడ్ లో ఎంతో మంది ధ్యానం ఇప్పటికే చేస్తున్నారన్నారు.నిజాంబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లా నేషనల్ హైవే కి పక్కన గ్రామాలలో ఉన్న పిరమిడ్ ధ్యాన కేంద్రాలు ఉచితంగా సేవ చేసే వాళ్ళు ఇలాంటి బోర్డులు ఏర్పాటు చేసుకుంటే ఇంకా ఎంతో మంది ధ్యానం చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
పిరమిడ్ ధ్యాన మందిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



