నవతెలంగాణ-తొగుట
మత్స్యకారులు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మత్స్యశాఖ సొసైటీ డైరెక్టర్ ఆకారం సత్త య్య సూచించారు. ఆదివారం మండల పరిధిలోని తుక్కాపూర్ గ్రామానికి చెందిన మత్స్యకారులకు లైసెన్సులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మత్స్యకారుడు లైసె న్స్ ధరకాస్తు చేసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభు త్వం అందిస్తున్న సబ్సిడీ రుణాలను సైతం సద్వి నియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ ముదిరాజ్ మహాసభల మండల అధ్యకుడు ఊళ్లేంగాల సాయి, మత్స్యకార గ్రామ సొసైటీ అధ్యక్షులు చిక్కుడు స్వామి, ఉపాధ్యక్షు డు బోయిని బాలరాజ్, ముదిరాజ్ సంఘం గ్రామ అధ్యక్షుడు మాస్టి యాదయ్య, ఉపాధ్యక్షులు బరెం కల స్వామి, డైరెక్టర్లు కర్ణకర్, కంచం స్వామి, సంఘం గొడుగు శ్రీశైలం, స్వామి, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES