నవతెలంగాణ – జక్రాన్ పల్లి : రాష్ట్ర జాతీయ స్థాయిలో ఎంపికయ్యే విధంగా సమ్మర్ కోచింగ్ క్యాంప్ ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి ముత్తెన్న అన్నారు. జక్రాన్పల్లి మండలంలోని కలిగోట్ ఉన్నత పాఠశాలలో వాలీబాల్ శిక్షణ శిబిరాన్ని ముత్తెన్న శుక్రవారం సందర్శించారు. జిల్లా యువజన క్రీడాశాఖ ఆధ్వర్యంలో కలిగోట్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న వాలీబాల్ కోచింగ్ క్యాంపులో భాగంగా నేడు యువజన క్రీడ అధికారి ముత్తెన్న ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులకు వాలీబాల్, వాలీబాల్ నెట్టు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమ్మర్ వాలీబాల్ కోచింగ్ క్యాంపును సద్వినియోగం చేసుకొని రాబోయే రోజుల్లో రాష్ట్ర జాతీయ స్థాయిలో ఎంపికయ్య విధంగా మెలుకువలు నేర్చుకోవాలని వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పురుషోత్తమాచారి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ సువర్ణ, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, వ్యాయామ ఉపాధ్యాయుడు యాదగిరి, మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.
వేసవి శిక్షణా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES