Saturday, March 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మద్ధతు ధరను సద్వినియోగం చేసుకోండి

మద్ధతు ధరను సద్వినియోగం చేసుకోండి

- Advertisement -

-కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి విజ్ఞప్తి 
నవతెలంగాణ – బెజ్జంకి

ఆరుగాలం కష్టపడి రైతులు సాగు చేసిన పంటల దినుసుల విక్రయానికి ప్రభుత్వం మద్ధతు ధర కల్పించి..కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని.. రైతులందరూ మద్ధతు ధరను సద్వినియోగపర్చుకోవాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు.శనివారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యందు పీఏసీఎస్ అధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ చైర్మన్ పులి క్రిష్ణ,సర్పంచ్ బొల్లం శ్రీధర్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి, పలువురు రైతులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే అహర్నిశలు కృషి చేస్తోందని..కొనుగోలు కేంద్రాల్లో మొక్కజోన్న క్వి.రూ.2400, ప్రొద్దుతిరుగుడు ధాన్యం క్వి రూ.7721 మద్ధతు ధర ప్రభుత్వం కల్పించిందన్నారు. మద్య దళారుల దోపిడీకి గురవ్వకుండా నిబంధనల మేరకు రైతులు సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని కోరారు. వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ మహేశ్, ఏఎంసీ సభ్యులు బోనాల మల్లేశం, పులి సంతోష్, పీఏసీఎస్ సిబ్బంది బుచ్చయ్య, అనిల్, ఆలయ మాజీ చైర్మన్ ప్రభాకర్, కాంగ్రెస్ జిల్లాధికార ప్రతినిధి పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మండలాధికార ప్రతినిధి పోచయ్య, నాయకులు బైర సంతోష్, బోయిని ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -