– డీటీ (ఎలక్షన్) హుస్సేన్
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని,దాన్ని సద్వినియోగం చేసుకుంటేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది అని ఎలక్షన్ డీటీ హుస్సేన్ అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం పురస్కరించుకుని విద్యార్ధులకు అవగాహన కల్పించడానికి వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హత గల పౌరుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
శుక్రవారం నియోజక వర్గం వ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్ధులకు ఆయన రూ.3 వేలు తన స్వీయ వ్యయంతో బహుమతులు అందజేసారు. వక్త్రుత్వ లో సీనియర్స్ విభాగంలో దమ్మపేట జెడ్పీహెచ్ఎస్ 10 వ తరగతి విద్యార్ధిని జి.ప్రణీత ప్రధమ,అశ్వారావుపేట జెడ్పీహెచ్ఎస్ 9 వ తరగతి విద్యార్ధి సాయి కౌశిక్ ద్వితీయ,అన్నపు రెడ్డి పల్లి టీజీఆర్డబ్ల్యుఎస్ 9 వ తరగతి విద్యార్ధి వై.జీవన్ కుమార్ తృతీయ బహుమతిని గెలుచుకున్నారు.
జూనియర్స్ విభాగంలో ఆసుపాక యూపీఎస్ 8 వ తరగతి విద్యార్ధి ఏ.వినయ్,జెడ్పీహెచ్ఎస్ నారాయణపురం 8 వ తరగతి విద్యార్ధి వి.నిఖితా శ్రీ,జెడ్పీ హెచ్ ఎస్ అశ్వారావుపేట 7 వ తరగతి విద్యార్ధి టీ.నీలిమ ప్రధమ,ద్వితీయ,తృతీయ స్థానాల్లో నిలిచారు. క్విజ్ లో జెడ్పీహెచ్ఎస్ మామిళ్ళవారిగూడెం,టీజీ ఎంఆర్ఈఎస్ అశ్వారావుపేట,జెడ్పీ హెచ్ ఎస్ దమ్మపేట లు ఒకటి,రెండు,మూడు స్థానాల్లో నిలిచారు.
డ్రాయింగ్ లో…
సీనియర్స్ విభాగంలో జెడ్పీ హెచ్ ఎస్ పట్వారిగూడెం విద్యార్ధి కే.వర్షిత,జెడ్పీ హెచ్ ఎస్ దమ్మపేట విద్యార్ధి వీ.భార్గవి,జెడ్పీహెచ్ఎస్ నారాయణపురం విద్యార్ధి ఆర్.రోహిత్ లు వరుసక్రమంలో నిలిచారు. జూనియర్స్ విభాగంలో జెడ్పీ హెచ్ ఎస్ దమ్మపేట విద్యార్ధి కే.జాన్సీ,జెడ్పీ హెచ్ ఎస్ నారాయణపురం విద్యార్ధి టీ.వరుణ్ సందీప్ లు వరుస క్రమంలో గెలుపొందారు.
వ్యాస రచనలో…
సీనియర్స్ విభాగంలో గండుగులపల్లి బి.జోషిత,అచ్యుతాపురం బీ.ప్రేమనందిని,ఎస్కే బషీర్ లు ప్రధమ,ద్వితీయ,తృతీయ స్థానాల్లో గెలుపొందారు. జూనియర్స్ విభాగంలో ఆసుపాక వినయ్,నారాయణపురం నిఖితా శ్రీ,అన్నపురెడ్డిపల్లి నిశాంత్ లు వరుసక్రమంలో నిలిచారు.



