నోబెల్ ఫౌండేషన్‌పై పెరుగుతున్న ఒత్తిడి
ఓస్లో : తనకు ప్రదానం చేసిన నోబెల్ శాంతి బహుమతిని వెనిజులా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు అందజేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. మచాడో చర్యపై నోబెల్ ఫౌండేషన్ కూడా ఆగ్రహంతో ఉంది. మచాడోకు ప్రకటించిన శాంతి బహుమతిని రద్దు చేయాలని లేదా దానిని వేరే వారికి బదిలీ చేయాలని పలువురు ప్రముఖులు నోబెల్ ఫౌండేషన్‌ను కోరుతున్నారు. నోబెల్ బహుమతి ట్రంప్ చేతిలోకి వెళ్లినా అది మచాడో పేరిటే ఉంటుందని నోబెల్ ఇన్‌స్టిట్యూట్ వివరణ ఇచ్చింది. ‘మచాడో బంగారు పతకాన్ని ట్రంప్‌కు ఇచ్చినప్పటికీ ఆ బహుమతి ఆమె పేరిటే ఉంటుంది. బహుమతిని బదిలీ చేయడం, పంచుకోవడం లేదా రద్దు చేయడం కుదరదని నోబెల్ ఇన్‌స్టిట్యూట్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు’ అని గత వారం తెలియజేసింది. దీనిపై పునరాలోచన చేయాలని అభ్యర్థనలు రావడంతో నోబెల్ ఫౌండేషన్ మరోసారి వివరణ ఇచ్చింది. నోబెల్ బహుమతిని బదిలీ చేయడానికి లేదా రద్దు చేయడానికి ఆల్‌ఫ్రెడ్ నోబెల్ నిబంధనలు అంగీకరించవని తెలిపింది.
మచాడోపై నార్వేలో ఆగ్రహం
మచాడో చర్యపై నార్వేలో మాత్రం తీవ్ర విమర్శలు వ్యక్తమవు తున్నాయి. మచాడో చర్య అసంబద్ధమైన దని, నోబెల్ బహుమతి గౌరవానికి భంగం కలిగిస్తోందని సోషలిస్ట్ లెఫ్ట్ పార్టీ నేత కిర్‌స్టీ బెర్గ్‌స్టో విమర్శించారు. శాంతి బహుమతిని వేరొ కరికి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ పదే పదే చేస్తున్న హెచ్చరికలను చూస్తుంటే ఆయనకు ఈ బహుమతిని అందజేయడం వెర్రితనమని అన్నారు. సెంటర్ పార్టీ నేత ట్రిగ్వే స్లాగ్స్‌వోల్డ్ వెదం మాట్లాడుతూ ఒకరికి ప్రదానం చేసిన బహుమతిని అంగీకరించడమంటే ట్రంప్ ఎలాంటి వ్యక్తో అర్థమవుతోందని వ్యాఖ్యా నించారు. మచాడో చర్య అవమానకరమని, నష్టదాయకమని ఓస్లో మాజీ మేయర్ రేమండ్ జొహన్‌సేన్ చెప్పారు. శాంతి బహుమతిని ట్రంప్ అవమానించారని ఓస్లో యూనివర్సిటీలో అంతర్జాతీయ విధాన నిపుణుడు ప్రొఫెసర్ మాట్లరీ అన్నారు.
శాంతి బహుమతిని వెనక్కి తీసుకోండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



