పొలాల్లో పంటలు వేసి పదుగురి
ఆకలి తీర్చాలని తపనపడే వారి మీద
కక్షగట్టె పిదపబుద్ధితో కాషాయం మాటున కల్లబొల్లి కబుర్లు చెప్పి
సౌకర్యాలు కలిపిస్తామంటూనే
అన్నం కంచంలో మన్ను పోసే చందాన
వాళ్ళ తైనాతీ పశువుల్ని తోలి పచ్చదనం మట్టుబెట్టి
అందరినోళ్ళల్లో మన్నువడ్డట్టు చేస్తానంటే
చేతులు ముడుచుకొని ఏడ్చేవారెవరూ లేరు
మీ చేత పాయిమాలు కట్టించడమే కాదు
కొటేరు నాగళ్ళెత్తిన చేతులతో కొడవళ్ళు బిగించి తెగనరకుతారు
ఒక మునుం పట్టి మభ్యపెట్టి ఎన్నిదినాలు పబ్బం గడపాలనిచూస్తారు
వంచనా శిల్పంతో దగాకోరు విద్యలు ప్రదర్శిస్తారు
కోపం తీవ్రం రూపందాల్చితే దంచికొడతారు తస్మాత్ జాగ్రత
మట్టి పిసికే వాళ్ళని హేళనచేస్తే మట్టికరిపిస్తారని తెలుసుకుని మసలండి
ఒకటి మాత్రం గుర్తుంచకుని మెలగండి
మెత్తటి మనిషికి అలకపూని వ్యవసాయానికి సెలవిస్తే
మెతుకుకు దిక్కలేక అలమటించక తప్పదని గ్రహించండి
చేతులు కాలాక…ఆకులు పట్టుకుంటే ఏమీ లాభంలేదు
కబడ్ధార్…. వెన్నెముక కూలబడితే
పర్యవసానమేమిటో తెలుసుకోండి
– కపిల రాంకుమార్, 9849535033
కబడ్ధార్
- Advertisement -
- Advertisement -