Tuesday, March 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంభయం లేకుండా పరీక్షలు రాయండి

భయం లేకుండా పరీక్షలు రాయండి

- Advertisement -

– యోగితారాణా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

పదవ తరగతి విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా పరీక్షలను రాయాలని విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్‌ యోగితారాణా సూచించారు. సోమారం టీశాట్‌ నిర్వహించిన ప్రేరణాత్మక మార్గదర్శక సెషన్‌లో ఆమెతో పాటు స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌.ఇ.నవీన్‌ నికోలస్‌, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ జి.రమేశ్‌, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ సైకాలజీ విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ పద్మజా, గెజిటెడ్‌ హెడ్‌మిస్ట్రెస్‌ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగితారాణా మాట్లాడుతూ ఆందోళన చెందకుండా సానుకూల ఆలోచనను కొనసాగించాలని సూచించారు. నవీన్‌ నికోలస్‌ మాట్లాడుతూ విషయాన్ని సవరించుకోవడానికి అభ్యాస దీపికను ఉపయోగించుకోవాలని కోరారు. డాక్టర్‌ పద్మజా మాట్లాడుతూ మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనీ, ఆరోగ్యవంతమైన శరీరం మెదడును మెరుగ్గా పని చేయడానికి సహాయపడుతుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -